రాజన్ కాంగ్రెస్ ఏజెంట్: స్వామి | Rajan worked as a Congress agent since the BJP came to power: Subramanian Swamy | Sakshi
Sakshi News home page

రాజన్ కాంగ్రెస్ ఏజెంట్: స్వామి

Published Sun, Jun 19 2016 2:06 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

రాజన్ కాంగ్రెస్ ఏజెంట్: స్వామి

రాజన్ కాంగ్రెస్ ఏజెంట్: స్వామి

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తానెప్పుడూ అనుమానించినట్టుగానే రాజన్‌ కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేశారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజన్ కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను దెబ్బతీయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు వెన్నుపోటు పొడిచారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్ గా కొనసాగే ఉద్దేశం లేదని రాజన్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. గతంలో పలుమార్లు రాజన్ పై స్వామి విరుచుకుపడ్డారు. పత్రికాముఖంగా, ట్విటర్‌ వేదికగా విమర్శలు చేయడంతోపాటు స్వయంగా ప్రధానికి సైతం రెండుసార్లు లేఖలు రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement