నర్సరీ చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా వ్రపర్తించిన క్యాబ్ డ్రైవర్‌ అరెస్టు | School cab driver arrested for molesting minor | Sakshi
Sakshi News home page

నర్సరీ చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా వ్రపర్తించిన క్యాబ్ డ్రైవర్‌ అరెస్టు

Published Sun, Nov 23 2014 11:09 PM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

School cab driver arrested for molesting minor

న్యూఢిల్లీ: నర్సరీ చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం ఆ బాలిక పట్ల క్యాబ్ డ్రైవర్ మనోజ్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని తిమార్‌పూర్ పరిధిలో చోటు చేసుకొంది. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. ఈమేరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ ప్రైవేట్ పాఠశాలల  క్యాబ్స్ నడిపించే డ్రైవర్ మనోజ్‌కుమార్‌ను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్‌కు కూడా బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement