యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురి ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంపై సీమాంధ్ర ఎంపీలు స్పందించారు.

'కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. 30 ఏళ్లపాటు సేవచేసిన నన్ను బహిష్కరించడం బాధాకరం. రాష్ట్ర కాంగ్రెస్‌ను సర్వనాశనం చేస్తున్నారు. వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురవ్వడం ఖాయం'
- ఎంపీ సాయిప్రతాప్

'మా బహిష్కరణకు సంబంధించి నోటీసులందిన తర్వాత స్పందిస్తాం. అందరినీ కలుపుకుని పార్లమెంట్‌లో మరింత సమర్థవంతంగా సమైక్యవాణి వినిపిస్తాం'
- ఉండవల్లి అరుణ్ కుమార్

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. అన్నింటికి సిద్దపడే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. అవిశ్వాస తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు, పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాత్రమే
- రాయపాటి సాంబశివరావు
అన్నింటికి సిద్దపడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాటం చేస్తున్నాం. సస్పెన్షన్ వేటు పడినా తమ పోరాటంలో ఎలాంటి సడలింపు ఉండదు. అప్రజాస్వామిక పద్దతిలో విభజన బిల్లును పార్లమెంట్ లో ఎలా ప్రవేశపెడుతారు
- లగడపాటి
తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. విభజన బిల్లును అడ్డుకోవడం, వ్యతిరేకించి ఓటు వేసే అవకాశం కల్పించి కాంగ్రెస్ తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక తమను అడ్డుకునేవారు ఉండరని అన్నారు. తమను పార్టీ నుంచి బహిష్కరించగలరు కానీ పార్లమెంట్ తప్పించలేరు. - సబ్బం హరి
ఎప్పుడో అవిశ్వాస తీర్మానం నోటిస్ ఇచ్చాం. ఇప్పడు వేటు వేశారు. ఈ వ్యవహారం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది. చిదంబరం, జై రాంరమేశ్ లు సోనియాను తప్పుదారి పట్టిస్తున్నారు. సోనియా తప్పుడు సలహాలు ఇస్తున్న చిదంబరం, జై రాం రమేశ్ లు రాజీనామా చేయాలి.
- హర్ష కుమార్
'మా సహచర ఎంపీలను బహిష్కరించడం బాధాకరం. విభజనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. మేమంతా సమైక్యవాదులం' - అనంత వెంకట్రామిరెడ్డి