మోడీ హవా ఉంటే బీజేపీకి భయమెందుకు! | Shiva Sena chief takes dif at BJP on Modi Wave | Sakshi
Sakshi News home page

మోడీ హవా ఉంటే బీజేపీకి భయమెందుకు!

Published Wed, Oct 1 2014 4:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోడీ హవా ఉంటే బీజేపీకి భయమెందుకు! - Sakshi

మోడీ హవా ఉంటే బీజేపీకి భయమెందుకు!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై శివసేన తొలిసారి విమర్శనాస్త్రాల్ని సంధించింది. మోడీ హవాపై విశ్వాసం ఉంటే బహిరంగ సభల్లో ప్రసంగించడానికి ప్రధానమంత్రిని ఎందుకు పిలుస్తున్నారని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో నిర్వహించే ర్యాలీలో మోడీ ప్రసంగాలకు బీజేపీ  ఏర్పాటు చేస్తోందనే వార్తలపై ఉద్దవ్ స్పందించారు. 
 
నాకు మోడీపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. కాని రాష్ట్రంలో మోడీ హవా ఉందా అనే అంశంపై అనేక అనుమానాలున్నాయి. మోడీ హవా ఉంటే ఆయనను ఎందుకు ప్రచారానికి పిలుస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రధాని ప్రచారం నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుందన్నారు. తాజా ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు వ్యవహారంలో విఫలం కావడంతో 25 బంధాన్ని శివసేన, బీజేపీలు తెగతెంపులు చేసుకున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement