
తిరునెల్వేలి : బైకులో ట్యాంక్ ఫుల్ చేయించుకున్న ఓ వాహనదారునికి, ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంకులో ట్యాంక్ నింపుకుని బయలుదేరబోతున్న సమయంలో అగ్నిప్రమాదానికి గురయ్యాడు ఆ వాహనదారుడు. ఈ షాకింగ్ సంఘటన తిరునెల్వేలి పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. సీసీటీవీలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. బైకుపై కూర్చున్న వాహనదారుడు, తన ట్యాంక్ ఫుల్ చేయించున్నాడు. ఆ అనంతరం నగదు చెల్లించి, బైక్ స్టార్డ్ చేశాడు. ఇక అంతే భగ్గుమని మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ మంటలకు వాహనదారుడు గాయాల పాలయ్యాడు. బైకుకు మంటలు అంటుకోవడంతో, వాహనదారుడిని రక్షించడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది అంతా అతని వద్దకు పరిగెత్తారు. గాయాల పాలైన ఆ వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనదారుడు తన ట్యాంక్ ఫుల్ చేయించుకున్న అనంతరం ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై ఉండొచ్చని రిపోర్టులు తెలిపాయి. ఇదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిసింది. ఈ ప్రమాదాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.
పెట్రోల్ బంకులో ప్రమాదం: సీసీటీవీ దృశ్యాలు 
Comments
Please login to add a commentAdd a comment