సాక్షి, ముంైబె : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ అభ్యర్థిగా శివసేన తరఫున స్నేహల్ అంబేకర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం రాజకీయ రంగప్రవేశం చేసిన స్నేహల్...గత ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. రిజర్వేషన్ కారణంగా ఆమెకు కేవలం రెండున్నర ఏళ్లలోనే మేయర్ పదవి చేపట్టే అవకాశం లభించనుంది.
పార్టీ అభ్యర్థిగా స్నేహల్ పేరును శివసేన ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఆమె తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం ముంబై మేయర్‌గా ఉన్న సునీల్ ప్రభు పదవీ కాలం ఈ నెల ఎనిమిదో తేదీతోముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీన మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. శివసేన-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో శివసేన అభ్యర్థి స్నేహల్ మేయర్ ఎన్నిక కావడానికి ఎటువంటి విఘ్నాలు ఎదురుకావనేది సుస్పష్టం. అయినప్పటికీ తొమ్మిదో తేదీన ఎన్నికలు నిర్వహించి అధికారికంగా ఆమెను మేయర్‌గా ప్రకటించనున్నారు.
మరోవైపు బీజేపీ కార్పొరేటర్ అల్కా కేర్కర్ డిప్యూటీ మేయర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మేయర్‌గా స్నేహల్, డిప్యూ టీ మేయర్‌గా అల్కా పదవులను అలంకరించనున్నారు.
ఇదిలా ఉండగా సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ తరఫున మేయర్ పదవికి డాక్టర్ ప్రియతమా సావంత్, డిప్యూటీ మేయర్ పదవి కి ఎన్సీపీ తరఫున చందన్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్‌సీ కోటాలో ఉన్న లోయర్ పరేల్‌లోని 194వ వార్డు నుంచి స్నేహల్ అంబేకర్ విజయం సాధించారు. దీంతో ఆమెను అత్యున్నతమైన మేయర్ పదవి వరించనుంది. జీవిత భీమా సంస్థలో (ఎల్‌ఐసీ)లో సీనియర్ సేల్స్ ఎక్గిక్యూటివ్ విధులు నిర్వర్తిస్తున్న స్నేహల్ అంబేకర్ భర్త శివసేన ఉపశాఖ ప్రముఖుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కానున్న అల్కా కేర్కర్ పశ్చిమ బాంద్రాలోని 93వ ప్రభాగ్ నుంచి ఘన విజయం సాధించారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కార్పొరేటర్‌గా విజయం సాధించిన మొదటి టెర్మ్‌లోనే ఆమెను డిప్యూటీ మేయర్ పదవి వరించనుండడం విశేషం.
బీఎంసీ మేయర్ ఎన్నికలు
Published Sat, Sep 6 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement