
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల అన్ని రంగాల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అన్నారు. గురువారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ఆమె మట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించడం వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలను ఆదుకునేందుకు కనీస ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. (ధరల నియంత్రణకు ఏం చేశారో చెప్పండి )
కరోనా వైరస్ రోగులను నయం చేసేందుకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ కోరారు. వైరస్ ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలు, కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల నష్టపోతున్న కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించాలని ఆమె అన్నారు. రైతులకు ముఖ్యమైన పంట కోతలు, కొత్త పంటలు వేసుకునే సమయం కాబట్టి రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి ఆమె సూచించారు. (పొదుపు ఖాతా వడ్డీరేట్లలో కోతపై చిదంబరం ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment