టీ. బిల్లుపై కేంద్రం ముమ్మర కసరత్తు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన బిల్లును ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన కసరత్తును ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ బిల్లుపై చర్చించేందుకు సోమవారం బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో చర్చలు జరిపారు. సవరణలపై చర్చ కొనసాగుతోంది.
మరోవైపు పార్లమెంట్ సెంట్రల్ హాలులో వెంకయ్యనాయుడుతో సోనియాగాంధీ సంభాషించారు. తెలంగాఱ బిల్లుకు మద్దతు ఇవ్వాలని సోనియా ఈ సందర్భంగా వెంకయ్యను కోరారు. తెలంగాణ సవరణలు చేయాలని డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడుకు సవరణలేంటో ఇవ్వాలని సోనియా కోరారు. తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే మద్దతు ఇస్తామని వెంకయ్య స్పష్టం చేశారు.