పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో సభ్యులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యే అవకాశముంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో సభ్యులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యే అవకాశముంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ సీట్ల కేటాయింపు కొలిక్కి రాని సంగతి తెలిసిందే. వచ్చే నెలలో శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో పార్టీలకు సీట్లను కేటాయించే అవకాశం ఉందని పార్లమెంట్ అధికారి ఒకరు తెలిపారు.
సోమవారం జరిగే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 24న ప్రారంభమై నెల రోజులు కొనసాగుతాయి. లోక్‌సభలో ఏ పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఎక్కువ పార్టీలు ముందు వరుస సీట్లను కేటాయించాలని స్పీకర్‌ను కోరుతున్నాయి.