ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పురంగోల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులు ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.