చెన్నై: పాఠశాలల్లో వందేమాతర గేయాన్ని తప్పనిసరిగా పాడాల్సిందేనని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కనీసం వారంలో రెండు రోజులైనా స్కూళ్లలో వందేమా తరాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. సోమ, శుక్రవారాల్లో జాతీయ గేయాన్ని విద్యార్థులతో పాడించాలని తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సూచించింది.
మంగళవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంవీ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నెలకు ఒకసారైనా వందేమాతర గేయాన్ని ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ బెంగాలీ, సంస్కృతంలో వందేమాతరాన్ని ఆలపించడం ప్రజలకు కష్టమైతే.. తమిళంలోకి అనువాదం చేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు.