మాల్యా బ్యాంకుల ఇజ్జత్ తీసేశాడు!
న్యూఢిల్లీ: దేశంలోని 17 ప్రముఖ బ్యాంకులకు రూ. 7వేల కోట్ల వరకు ఎగనామం పెట్టి.. విదేశాల్లో విహరిస్తున్న విజయ్‌మాల్యా వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ నేపథ్యంలో తీసుకున్న అప్పులకుగాను ఆయన నుంచి ప్రతి పైసాను బ్యాంకులు వసూలు చేయాల్సిందేనని, ఇదే తమ ప్రభుత్వ వైఖరి అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
విజయ్ మాల్యా వివాదం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చగా మిగిలిందని ఆయన పేర్కొన్నారు. ఓ టీవీ చానెల్ సదస్సులో అరుణ్ జైట్లీ గురువారం మాట్లాడారు. మాల్యా నుంచి ప్రతి పైసాను వసూలు చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించిందని చెప్పారు. మాల్యా దివాళాదారుగా తేలిన మరుక్షణపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు బ్యాంకులు మాల్యా ఆస్తుల వేలానికి సిద్ధమయ్యాయి. అయితే ముంబైలో ఆయనకు చెందిన కింగ్‌ఫిషర్ హౌస్ ఈ-వేలానికి పెట్టగా.. దానికి కొనడానికి ఒక్కరూ ముందుకు రాలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.