పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వలు | Water Level In 91 Major Reservoirs Dips To 22 Per Cent: Government | Sakshi
Sakshi News home page

పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వలు

Published Sat, Apr 23 2016 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

Water Level In 91 Major Reservoirs Dips To 22 Per Cent: Government

న్యూఢిల్లీ:  దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలలో నీటి నిల్వలు 22 శాతం మేరకు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇదేసమయానికి 34 బిలియన్ క్యూబిక్ మీటర్లు ( బీఎంసీ) గా ఉన్న నీటి నిల్వలు ప్రస్తుతం 157 బీసీఎమ్ లుగా ఉన్నాయని, ప్రస్తుతం  పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వల సామర్థం పడిపోయిందని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోని ప్రధాన రిజర్వాయర్లలో  నీటి నిల్వల సామర్థ్యం బాగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్, త్రిపురలలో నీటి నిల్వలు కాస్త మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సమానంగా నిల్వలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement