సుష్మా చొరవతో ఢిల్లీ చేరుకున్న సోను | Welcome Home Sonu': Sushma Swaraj To Boy Who Was Traced in Bangladesh | Sakshi
Sakshi News home page

సుష్మా చొరవతో ఢిల్లీ చేరుకున్న సోను

Published Thu, Jun 30 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

Welcome Home Sonu': Sushma Swaraj To Boy Who Was Traced in Bangladesh

న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఢిల్లీలో తప్పిపోయి బంగ్లాదేశ్ చేరుకున్న బాలున్ని విదేంశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇండియాకు రప్పించారు. గీతా  గురుప్రీత్ అలియాస్ సోనును  బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి తీసుకురావడంలో సుష్మా ముఖ్యమైన పాత్ర పోషించారని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.  బంగ్లాదేశ్ లోని  జెస్సోర్ లో ఉన్న సోను తాను 2010 లో ఢిల్లీలో తప్పిపోయానని అక్కడి అధికారులకు చెప్పాడు.  ఈ విషయం తెలుసుకున్న సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ లోని ఇండియన్ హైకమిషన్ లో పనిచేస్తున్న సీనియర్ అధికారిని జెస్సోర్ చేరుకొని బాలున్ని ఢిల్లీకి పంపించాలని  ఆదేశించారు. దీంతో బంగ్లాదేశ్ నుంచి గురువారం సోను ఢిల్లీకి చేరుకున్నాడు. 

ఇటీవల గతంలో సౌదీ అరేబియాలో తన తండ్రిని అరెస్టు చేశారని సహాయం చేయాలని ఓ పదిహేనేళ్ల అమ్మాయి పలుమార్లు ట్విట్టర్ ద్వారా చేసిన అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించి సాయం చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement