సుప్రీంలో మహిళా లాయర్ ఆత్మహత్యాయత్నం | Woman lawyer alleges gangrape, consumes poison in Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంలో మహిళా లాయర్ ఆత్మహత్యాయత్నం

Sep 23 2014 3:02 AM | Updated on Aug 1 2018 4:24 PM

సుప్రీంకోర్టులో ఓ మహిళా న్యాయవాది ఆత్మాహత్యాయత్నం చేశారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా న్యాయవాది ఆత్మాహత్యాయత్నం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోథా కేసుల విచారణ అనంతరం తన స్థానం నుంచి లేచి వెళుతున్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా న్యాయవాది తనపై భర్త కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సమయంలో ఆమె మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో తోటి మహిళా న్యాయవాది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మహిళా న్యాయవాది తాను నాప్తలిన్ బాల్స్ మింగానని చెప్పారు. ఆమెను సుప్రీంకోర్టు ఆస్పత్రికి తరలించాలని లోధా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement