నేటి నుంచి ప్రధాని గల్ఫ్‌ పర్యటన | Narendra Modi Gulf Tour From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రధాని గల్ఫ్‌ పర్యటన

Published Fri, Aug 23 2019 6:41 AM | Last Updated on Fri, Aug 23 2019 6:41 AM

Narendra Modi Gulf Tour From Today - Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: మన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. 23న యూఏఈలోని అబుదాబిలో, 24న బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. యూఏఈ, బహ్రెయిన్‌లో మన దేశ పారిశ్రామికవేత్తల కోసం జారీ చేయనున్న రూపే కార్డును ప్రధాని ఆవిష్కరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి ‘ఫాదర్‌ ఆఫ్‌ ఫౌండర్‌ యూఏఈ’ పురస్కారాన్ని అందజేయనుంది. కాగా, బహ్రెయిన్‌లో పర్యటించనున్న మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు, ఇతర శాఖల మంత్రులు మాత్రమే బహ్రెయిన్‌లో పర్యటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement