ప్రభుత్వ విద్య ప్రతిభకు నెలవు | government education is the place of talent! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్య ప్రతిభకు నెలవు

Published Wed, Dec 10 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

ప్రభుత్వ విద్య ప్రతిభకు నెలవు

ప్రభుత్వ విద్య ప్రతిభకు నెలవు

వసతి గృహాలు పెట్టగానే ప్రమాణాలు రావు. మేనేజ్‌మెంట్‌కు లాభాపేక్ష కన్నా సామాజిక దృక్పథం కావాలి. కానీ దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులే పాలనలోకి ప్రవేశించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ విద్యాలయాన్ని పెట్టేందుకు ముందుకు రావడం గొప్ప విషయం.
 
 ఇల్లు అలుకగానే పండుగ కాదు, ఇంటిని తీర్చిదిద్దుకోవ టం అనుకున్నంత సులభమై నది కాదు. 1952లో విద్యా శాఖ సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన బాధ్య తను, కర్తవ్యాన్ని నిర్వహిం చేది. నేటి విద్యారంగం స్థితిని చూస్తే నాటి కంటే నేడు మరింత గురుతరమైన బాధ్యత విద్యాశాఖపై ఉంది. కాలమేదైనా విద్య అంటే సమాజ పరివర్తనే దాని కర్తవ్యం. నేటి ఆర్థిక రంగానికి విద్యారంగం బలమైన అంగంగా మారింది.    సామాన్యుని భాగస్వామ్యంతో అది నేడు అభివృద్ధికి దోహదపడవలసి ఉంది. కొత్తతరం వచ్చింది కానీ ఆ తరం బడి మాత్రం పోలేదు. విద్య వల్లనే తన భవిష్యత్‌ను, తన పిల్లల భవిష్యత్‌ను కూడా నిర్మించాలనే కాంక్షగల సమాజం వచ్చింది. ఆనాడు యజమాని చెప్పటం ఉద్యోగి చేయడం జరిగేది. దాన్నే కమాండింగ్ వ్యవస్థ అంటారు. కానీ ఈనాడు ఎవరూ ఏమీ చెప్పరు. ప్రతి విషయాన్ని ఉద్యోగే ఆలోచించుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి.
 
 నేడు ప్రతి విద్యార్థి ప్రతిరోజూ ఇంటర్వ్యూకు సిద్ధం కావలసివస్తోంది. ఎంతో లోతైన జ్ఞానం ఉం టే తప్ప నేటి విద్యార్థులు నిలదొక్కుకోలేరు. కాబట్టే విద్యారంగం బాధ్యత మరింత పెరిగింది. ఈ పరి స్థితుల్లో ఛిన్నాభిన్నమైన వ్యవస్థను గాడిలో పెట్ట టం ఒకటైతే, మారుతున్న ఆర్థికవ్యవస్థలో మనగ లిగిన మానవ సంపదను తయారు చేయడం కీల కమైనది.  అత్యున్నత నైపుణ్యం గల మేధావి వర్గం అందుకు అవసరం. ప్రతిభగల మేధావి వర్గం గాలి లోంచి ఊడిపడదు. ప్రతిభ రావాలంటే విద్యారం గంలో సమత్వం ఉండాలి. సమత్వం నుంచి వచ్చిన ప్రతిభ కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఈనాడు విద్యాశాఖ ఎక్సెలెన్సీ కన్నా ఈక్విటీపైన దృష్టిని కేంద్రీకరించాలి. సమత్వంలో విద్యార్థి నేపథ్యమే ప్రధానమైనది. వారి తల్లిదండ్రులు చదు వుకున్నవారు కాదు. ఈ పాత్రను కూడా ఉపా ధ్యాయవర్గమే నిర్వహించవలసి ఉంటుంది.


 బోధనకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, తర గతి వెలుపల మోటివేషన్‌కు కూడా అంతే ప్రాధా న్యత ఉంటుంది. దీన్ని గమనించే పీవీ నర్సింహా రావు అప్పట్లోనే రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను ప్రవేశపెట్టారు. విద్యార్థి చదువుకున్న స్కూలు పేరు చెప్పగానే ఆ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే వారు. ఆటల్లో, జనరల్ నాలెడ్జిలో కూడా ఆ పిల్లలు ఆరితేరినవారుగా నిలిచారు. ఆ పిల్లల బ్యాక్ గ్రౌండ్ చూస్తే పట్టణ ప్రాంతపు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఉపాధ్యాయులు కూ డా ఎంతో అంకిత స్వభావంతో హేమాహేమీలుగా పనిచేశారు. సమర్థవంతమైన పాఠశాలలను నిర్మిం చేందుకు ఆనాటి పాలకవర్గాలు ఎంత శ్రద్ధ వహిం చాయో గమనించాలి.
 
 అంకిత స్వభావమున్న ఉపాధ్యాయులను ఎన్నుకోవటం ఒక పనైతే, వారిని నిలబెట్టుకోవటా నికి కావల్సిన పరిస్థితులను కలిగించడం రెండో భాగం. సమత్వం తేవటం కోసం రెసిడెన్షియల్ హైస్కూల్స్ ఏర్పాటు చేశారు. అది కాకుండా ఈ పిల్లల ఉన్నత విద్య కోసమై నాగార్జునసాగర్‌లో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ పెట్టారు. రెండు మూడు సంవత్సరాల లోపలనే ఎస్‌ఎస్‌సీ ర్యాంకులతో పాటు, ఇంటర్మీడి యట్ ర్యాంకులన్నీ ప్రభుత్వ స్కూళ్లకే వచ్చాయి.
 
 పేద కుటుంబాల పిల్లల విద్యాప్రమాణాలు సం పన్న కుటుంబాల పిల్లల కన్న ఎక్కువగా వచ్చాయి. ప్రజలకు
 ప్రైవేట్ మేనేజ్‌మెంట్ స్కూళ్ల నిర్వాహకులు ఈ పేద పిల్లలకు ర్యాంకులు ఎలా వచ్చాయని ఆశ్చ ర్యపోయారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా అప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలు పెట్టాయి. కానీ ఆ ప్రభుత్వ స్కూళ్లు సాధించిన ఫలితాలు మాత్రం రాలేదు. రెసిడెన్షియల్ వ్యవస్థ వల్ల, విద్యార్థులకు భోజనం వల్ల వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, ఉపాధ్యాయుని అంకిత స్వభావం, ఉపాధ్యాయుడు-విద్యార్థి మ ధ్య సంబంధాలే విద్యాప్రమాణాలను నిర్ణయి స్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో మెరికల్లాంటి విద్యార్థు లున్నారని అనటం మాత్రమే కాదు. దాని వెనుక ఉపాధ్యాయుల దీక్ష ఎంత గొప్పదో గుర్తించాలి. వసతి గృహాలు పెట్టగానే ప్రమాణాలు రావు. మేనే జ్‌మెంట్‌కు సామాజిక దృక్పథం కావాలి. కానీ దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులే ప్రభుత్వ పాల నలోకి ప్రవేశించి ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరు గార్చే దశకు వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం పాత విద్యా వ్యవస్థలోని సుగుణాలను కొనసాగి స్తామంటోంది. ప్రభుత్వ విద్యారంగాన్ని గెలిపిస్తా మని, పేదవర్గాల పిల్లలను అత్యున్నత ప్రమాణా లుగల మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అంతా అభి నందిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షి యల్ విద్యాలయాన్ని పెట్టేందుకు ముందుకు రావ డం గొప్ప విషయం. దాంతోపాటుగా బోధనలో బంగారు బాటలువేయాలి. ప్రపంచస్థాయిలో తెలంగాణ విద్యార్థులు ప్రతిభతో రాణించాలి. అం దుకు ప్రభుత్వం నిరంతర కృషి చేయవలసి ఉంది.
 (చుక్కా రామయ్య , వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement