కసరత్తు చాలని కమలం
విశ్లేషణ: ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మిఠాయి పొట్లంవలె నోరూరిస్తూ చేతికందేలా ఉంది. దీనిని అందుకోవాలంటే ఒకటే-రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎనభై రోజులుగా ఉద్యమిస్తున్న రాయలసీమ, కోస్తా ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పాలి. సీమాంధ్రుల మనోభావాలను గమనించకుంటే తెలంగాణ ఏర్పాటుకు మద్దతునీయమని ప్రకటన చేయాలి. రేపటి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడకుండా ఇది జరగాలి.
గ్రీకు పురాణాలలో టాంటలస్ కథ కనిపిస్తుంది. చేయరాని తప్పులేవో చేయడంతో ఈ రాజుకి దేవతలు చిత్రమైన శిక్ష విధించారు. ఒక పండ్ల చెట్టు కింద ఉన్న తటాకంలో రాజు నిలబడే ఉండాలి. కానీ దాహమే సినప్పుడు తాగేందుకు దోసిలి పడితే నీళ్లు దూరంగా జరుగు తాయి. ఆకలేసినప్పుడు పండ్లం దుకునేందుకు చేయి చాచితే కొమ్మలు అందకుండాపోతాయి. నిత్యం ఆకలితో, దాహం తో అలమటించాలి. నీళ్లు, పండ్లు అందుబాటులో ఉన్నా అందుకుందామంటే అందనంత దూరంగా జరిగిపోతా యి. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తే శాపగ్రస్థ టాంటలస్ గుర్తుకొస్తాడు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గెలు పనేది బీజేపీకి చేయి చాస్తే అందేంత దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. కానీ పదేళ్లుగా అందక బీజేపీని అలమటింప చేస్తూనే ఉంది.
నల్లేరు మీద నడక కాదు
2009లో బీజేపీకి 116 మంది ఎంపీల బలమే ఉంది. అగ్ర నేత ఎల్.కె.అద్వానీ ఆకర్షణ తగ్గిపోయిందనుకుని ఇప్పు డు నరేంద్రమోడీని తీసుకువచ్చారు. పార్టీ కళ్ల ముందు ఎన్డీఏ ప్రభుత్వం కనిపించేలా చేయడంలో మోడీ విజయ వంతమయ్యాడు కూడా. అయితే, మోడీ కూడా టాంట లస్ లాగా బాధపడతాడో లేక శాప విముక్తి చేసుకుంటాడో చూడాలి. నరేంద్ర మోడీ వల్ల కొంత ఉత్సాహం వచ్చినా, చాలా రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి ఊహించినంత ఆశాజనం గా లేదు. ముఖ్యంగా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ పార్టీ అంత ఆరోగ్యకరంగా లేదు. ఈ నాలుగు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు బీజేపీ చేతిలో ఉంటే ఢిల్లీ, రాజ స్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ నాలుగు రాష్ట్రాలలో కనీసం మూడు బీజేపీ గెల్చుకుని తీరాలి. కానీ అక్కడి రాజకీయ పరిస్థితులు దీనికి అనుకూలంగా కనిపిం చడం లేదు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నాయని, ఈసారి తమదే అవకాశమని బీజేపీ ఆశ. పదేళ్లుగా బీజేపీ చేతిలోనే ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా అదే సంభవించాలి! ఢిల్లీలో షీలాదీక్షిత్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్‌ల ప్రభుత్వాలతో ప్రజలు విసుగెత్తి ఉంటే, మధ్య ప్రదేశ్‌లో శివరాజ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్‌ల రమణ్‌సింగ్‌ల విషయంలోనూ అదే సూత్రం వర్తించాలి.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆకర్షణ తగ్గిపోతోంది. 2003 ఎన్నికలలో 288 స్థానాలు ఉన్న ఆ అసెంబ్లీలో 168 స్థానా లు గెలిచి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2008లో శివరాజ్ చౌహాన్ నాయకత్వంలో నెగ్గినా పార్టీ బలం 143కు పడిపోయింది. శివరాజ్ చౌహాన్ పెద్దగా వివాదా లలో, కుంభకోణాలలో చిక్కుకొనకపోయినా పాలనాదక్షు డిగా పేరు తెచ్చుకోలేకపోయాడు. ఆయనను గుర్తు చేసే పథకం, కార్యక్రమం లేవు. పదేళ్ల తర్వాత ఓటరులో ప్రభు త్వ వ్యతిరేకత, విరక్తి సహజం. నాయకత్వం నిత్యనూత నం కాకపోతే ప్రజల దృష్టి ఒక నాయకుడి మీదే నిలబడ టం కష్టం. శివరాజ్‌ది ఇప్పుడు ఇదే పరిస్థితి. చౌహాన్ ఓడిపోవడమంటూ జరిగితే అది బీజేపీకి విఘాతమే. ఢిల్లీ చుట్టూ తిరగడం, సదా పత్రికలలో కనిపించడం నచ్చని నాయకుడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్. చిన్న రాష్ట్రం కావడం వల్ల ఛత్తీస్‌గఢ్‌కు, అక్కడ అధికారంలో ఉన్నందుకు బీజేపీకీ సమస్యలు బాగానే ఉన్నాయి. 90 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో 2008లో 50 సీట్లు సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ కు, కమలానికి ఉన్న ఓట్ల వ్యత్యాసం ఒక శాతం. బీజేపీకి 50 శాతం, కాంగ్రెస్‌కు 49 శాతం ఓట్లు వచ్చాయి. బస్తర్ మావోయిస్టు ప్రాంతంలో ఉన్న 12 స్థానాలలో 11 గెల్చు కుని బీజేపీ అధికారానికి దగ్గరయింది. ఈ పదేళ్ల అధికారం వల్ల లబ్ధి పొందని బీజేపీ నాయకుల వల్ల పార్టీలో ముఠా లు వచ్చాయి. ప్రజలలో ఉన్న బీజేపీ వ్యతిరేకతకు ఈసారి ఇది కూడా తోడవుతుంది.
మారిన ఢిల్లీ దృశ్యం
ఢిల్లీలో ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీలే అధికారం పంచు కుంటూ వచ్చాయి. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడంతో పరిస్థితి మారింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఈ పార్టీతో బీజేపీ ఆశకు గండిపడే స్థితి కనిపిస్తున్నది. సాధారణ పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేకత సూత్రం ప్రకారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో అధికారం దక్కకపోతే బీజేపీ జాతీయస్థాయిలో గౌరవం కోల్పోతుంది. ఒక్క రాజస్థాన్ లోనే బీజేపీ గట్టెక్కేలా కనిపిస్తున్నది. ఇక్కడ కూడా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వివాదరహిత పాలన అందించడంలో విఫలమయిందనే చెప్పాలి. ఆ అపకీర్తి బీజేపీలో ధీమా పెంచింది. ఢిల్లీ, రాజ స్థాన్‌లను కోల్పోయినా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెల్చుకున్నా కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. మోడీ ఆత్మరక్షణలో పడిపోతాడు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శకు జవాబు చెప్పడం మోడీకి ఇబ్బంది కావచ్చు.
ఆంధ్రలో కమలం
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వేళ్లూను కోలేకపోతోంది. ఇప్పుడు తెలంగాణకు మద్దతుతో కొన్ని ఓట్లు తెచ్చుకునే అవకాశం దొరికింది. కానీ ఈ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు తెలంగాణలో ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితి ఉండటం వల్ల ఆ ఆశయం నెరవేరుతుందని కచ్చితంగా చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనంగా సీట్లు వచ్చే అవకాశం లేనందున, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎదురయ్యే ఓటమి భర్తీ చేసే మార్గం లేదు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ఓటమి బీజేపీని టాంటలస్‌గా మార్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రేపటి జాతీయ ప్రభు త్వం ఎవరిదో నిర్ణయించే శక్తి ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్ సభస్థానాలకే ఉందని బీజేపీకి, కాంగ్రెస్‌లకు తెలుసు.
ముందున్న అవకాశాలు
దేశ రాజకీయాలలో ఇకపైనా ఒక శక్తిగా కొనసాగాలనుకుం టే, 2014 ఎన్నికలలో గెలవడం బీజేపీకి చాలా అవసరం. ఓడిపోతే, అధికారంలోకి రాలేని పార్టీల జాబితాలో పడిపో తుంది. చాలా మంది విజేతకే ఓటేయాలని భావిస్తారు. విజేత ఎవరో వరస పరాజయాలను బట్టి ప్రజలు నిర్ణ యించుకుంటారు. బీజేపీ ఇలాంటి ఖాతాలో చేరిపోకూ డదు. మోడీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ఉంటుందా లేదా అనేది ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేల్చే స్తాయి. 2014లో అధికారంలోకి రావడం భారతీయ జనతాపార్టీ లక్ష్యమైతే రాయలసీమ, కోస్తా ప్రజల డిమాం డ్లకు సంపూర్ణ మద్దతు ఇవ్వక తప్పదు. అప్పుడు ఈ ప్రాం తంలోని 25 మంది ఎంపీల సానుభూతి దొరుకుతుంది. బీజేపీకి ఒకటో రెండో స్థానాలు దక్కవచ్చు. ఇతర పార్టీల ఎంపీలే ఢిల్లీలో ఎన్డీఏకి మద్దతునిచ్చేలా ఒత్తిడి తెస్తారు. ఈ ప్రాంతంలోని పదమూడు జిల్లాలో పెల్లుబికిన కాం గ్రెస్ వ్యతిరేకత చూశాక ప్రజలు బీజేపీకి మద్దతునీయ కుండా ఉండటం కష్టం. తెలంగాణ అంశానికి మద్దతుని చ్చినా బీజేపీకి అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం లేదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాదని తెలంగాణకే మద్దతునీయాలని నిర్ణయించడం వల్ల ఆ ప్రాంతంలో బీజేపీకి వచ్చే ప్రయోజనమేమీ లేదు. తెలం గాణ నుంచి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకండా సీమాంధ్ర ప్రజల మనోభావాలను బేఖాతరు చేయడం బీజేపీకి నష్టం కలిగిస్తుంది.
సీమాంధ్రులకు మద్దతిస్తే...
ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మిఠాయి పొట్లంవలె నోరూరిస్తూ చేతికందేలా ఉంది. దీనిని అందుకోవాలంటే ఒకటే-రాష్ట్ర విభ జనను వ్యతిరేకిస్తూ ఎనభై రోజులుగా ఉద్యమిస్తున్న రాయలసీమ, కోస్తా ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పాలి. సీమాంధ్రుల మనోభావాలను గమనించకుంటే తెలంగాణ ఏర్పాటుకు మద్దతునీయమని ప్రకటన చేయా లి. రేపటి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడకుండా ఇది జరగాలి. ఈ రాష్ట్రాలలో పరాజయం ఎదురయ్యాక విధానాలను మార్చుకునేందుకు బీజేపీకి తగినంత సమ యం ఉండదు. మాకియవెల్లి రాజకీయాల గురించి చెబు తూ ‘అది అసాధ్యాలను సుసాధ్యంచేసే కళ’ అన్నాడు. అందీఅందక ఊరిస్తున్న విజయాన్ని దక్కించుకోవాలనుం టే ఐదువందల ఏళ్ల కిందట మాకియవెల్లి చెప్పిన మాటల మర్మాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే టాంటలస్ తరహా శాపం నుంచి బీజేపీకి విముక్తి.