ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? | The super-selective coverage of our media | Sakshi
Sakshi News home page

ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

Published Sun, Jan 18 2015 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

ఇన్ఫోసిస్, విప్రో వంటి సాఫ్ట్‌వేర్ సంస్థల ఉద్యోగులతో ముడిపడిన ఘటనలను ఆసక్తికరంగా, పతాక వార్తలుగా చూపించే మన మీడియా అదే సమయంలో రిలయెన్స్ ఉద్యోగుల విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వదు. కారణం రిలయెన్స్‌కు ఉన్న ప్రకటనలిచ్చే శక్తి. అంగబలం, అర్థబలం కూడా.
 
ఈ వారం పత్రికలలో వచ్చిన రెండు ప్రధాన వార్తలు నన్ను ఆశ్చర్యం లో ముంచెత్తాయి. వీటి లో మొదటిది భారతీ యజనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఫెరోజ్ వరుణ్ గాంధీ రాసిన ఒక వ్యాసం. ‘ఒక అనిశ్చితమైన, మత్స్య న్యాయాన్ని పోలిన జీవితం’ గురించి వరుణ్ ఇక్కడ వర్ణించారు. భారతదేశంలో వ్యవసాయ పరిస్థితిని వర్ణిస్తూ ఆయన ఈ మాట లన్నారు. అంటే పెద్ద చేప చిన్న చేపను మింగే తర హా జీవితం భారతీయ రైతులదని అర్థం. నామ మాత్రంగా మిగిలిపోయిన భారతీయ రైతులు శతా బ్దాలుగా ఘోరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతు న్నారని ఆయన వ్యాసాన్ని ముగించారు. పైగా భారతీయ రైతులలో చాలామంది అనిశ్చితమైన మత్స్యన్యాయాన్ని పోలి ఉండే ‘నిరుపేద, మురికి, పశుప్రాయమైన, అల్ప జీవితం బారిన పడి నలుగు తున్నారన్నది ఆయన వ్యాసం ముగింపు.
 
 ఇక వరుణ్ గాంధీ పేర్కొన్న రెండో ప్రధాన వార్త ఏదంటే.. ‘కోట్లకు పడగలెత్తిన ముంబై మహిళ దిక్కులేని మరణం, ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ఉన్నత న్యాయస్థానం’. ముంబై నగరంలోని వెర్సో వాలోని యారి రోడ్డులో రూ. 30 కోట్ల విలువైన ఆస్తి ఉన్న 68 ఏళ్ల ముంబై మహిళ నిర్లక్ష్యం కారణంగా మరణించిన తీరును విని ఆగ్రహించిన హైకోర్టు, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించిందని ఈ వార్త పేర్కొంది. నగరంలోని ఈ శివారు ప్రాంతంలో చాలా మంది సంపన్నులు నివసిస్తుంటారు.
 ఆమె కుటుంబం కానీ, ప్రభుత్వం కానీ.. సీని యర్ పౌరుల సంక్షేమానికి, వైద్య సహాయానికి, వృద్ధుల శరణాలయాలకు బాధ్యత వహించే చట్టం ద్వారా ఆ వృద్ధురాలి బాగోగులను ఏమాత్రం పట్టిం చుకోకపోవడం దురదృష్టకరమని న్యాయస్థానం పేర్కొంది. నగరంలోని ఇతర సీనియర్ పౌరులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకూడదని కోర్టు అభిప్రా యపడింది. పైగా, తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 పరిధి, పరిమితు లను తాను సమీక్షించాలనుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.
 
 ఆ వృద్ధురాలి తరఫున వాదించిన న్యాయ వాది... గత ఐదేళ్లుగా ఆమె అలాంటి దీనస్థితిలోనే గడిపిందని ఇతరులకు ఆమె దుస్థితి ఎదురు కాకూ డదని కోర్టుముందు పేర్కొన్నారు. సీనియర్ పౌరు లపట్ల నిర్లక్ష్యం వహించి దురదృష్ట పరిణామాలకు కారణభూతులైన వారు అలాంటి వారి ఆస్తులకు వారసులు కానివిధంగా ఒక చట్టాన్ని తీసుకురా వాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే సహజ కారణాలతోనే ఆమె మరణించినట్లు ఆ వృద్ధురాలి శవ పంచనామా నివేదిక తెలిపిందని కోర్టు తెలిపింది.
 
 పతాక వార్త ప్రకటిస్తున్నట్లు, ఈ కథనంలో అంతకంటే తీవ్ర నేరంగా కనిపించిన అంశం ఏదం టే సంపన్న మహిళ అలాంటి దుస్థితిని అనుభవిం చిందన్న వాస్తవమే. వరుణ్ గాంధీ వ్యాఖ్య స్పష్టం చేసినట్లుగా బత కడానికి కొన్ని కోట్లమంది పోరాటం సల్పుతున్న దేశంలో సంపన్నురాలైన వ్యక్తిపై మీడియా దృష్టి పెడుతోంది. కొంతవరకు ఇది ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవితాలపై వార్తలు కవర్ చేయడం సాధారణంగా జరిగేదేనని ప్రపంచ మీడియా ఆమోదించింది.
 
 సంపన్నుల జీవితాలు మీడియా కవరేజ్ దృష్టిలో అత్యంత విలువైనవే మరి. అయితే భారత్‌లో దీన్ని సంప న్నులకే కాకుండా, మధ్యతరగతికి కూడా విస్తరిం చారు. అదే సమయంలో చాలా తరచుగా విశాల ప్రజారాసుల జీవితాలను మీడియా పూర్తిగా మిన హాయిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కానీ తరచుగా బీఎండబ్ల్యు ప్రమాదం అనే అంశాన్ని ప్రధాన వా ర్తగా ఎంచుకుంటుంటారు. ఎందుకంటే ఒక ఫ్యాన్సీ కారు మరింత ప్రాధాన్యమైన వార్తగా అర్హతను పొం దుతుంది. మన వార్తా పత్రికలతో బాగా పరిచ యమున్న వారిని బాగా ఇబ్బందిపెట్టే, కలవరపర్చే అంశాల్లో ఇదొకటి.
 
 ఈ అంశానికి సంబంధించి మరో ఉదాహర ణను తీసుకుందాం. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు, ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన ఉద్యోగిని తీసుకుందాం. సాఫ్ట్‌వేర్ సంస్థలు పెద్దగా ప్రకటనలు ఇవ్వవన్నది తెలిసిందే. బెంగళూరుకు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్‌కు లక్ష మంది ఉద్యోగు లున్నారు. ఈ సంస్థ ఉద్యోగి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, అత్యాచారానికి, హింసకు గురైనా, దొంగతనం బారిన పడినా సాధారణ ప్రజానీకం కూడా అలాంటి స్థితిని ఎదుర్కొనడంలో భాగంగానే వీటిని చూడాలి. అంతకుమించిన ప్రాధాన్యత ఇలాంటి ఘటనలకు ఉండదు.
 
 కాని మన మీడియా మాత్రం అనివార్యంగా ఇలాంటి సందర్భాల్లో ఆ సంస్థ పేరును తాటికా యంత అక్షరాలతో ప్రధాన వార్తగా తీసుకొస్తుంది. పైగా ఇంటర్నెట్‌లో ‘ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య’, ‘విప్రో ఉద్యోగి ఆత్మహత్య’ అనే పదాలతో ఇంటర్నె ట్‌లో సెర్చ్ కూడా చేస్తుండటం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం పొందటం అనేది ఆసక్తి గొలుపుతుంటుంది కాబట్టి వార్త అలాగే రూపొందుతుందని మీడియా వాదించ వచ్చు. కానీ ‘రిలయెన్స్ ఉద్యోగి ఆత్మహత్య’ అనే పదాన్ని సెర్చ్ చేయండి మరి. ఈ పదానికి ఇంటర్నె ట్‌లో లభించే ప్రాధాన్యత పూర్తి విరుద్ధంగా ఉం టుంది. రిలయెన్స్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకో కపోవచ్చు లేదా ఒకవేళ వారు నిజంగా ఆత్మహత్య చేసుకున్నా, మీడియా ఆ కంపెనీకి సంబంధించిన వార్తలను ప్రచురించడానికి వెనుకడుగు వేస్తుంది. అదే సమయంలో ఇన్ఫోసిస్, విప్రో సంస్థల విష యానికి వస్తే మీడియా ఇలాంటి సందర్భాల్లో చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంది.
 
 ఎందుకు? ఎందుకంటే సాఫ్ట్‌వేర్ సంస్థల కంటే రిలయెన్స్‌కు అంగబలం, అర్థబలం మెండు. అంతేకాకుండా అది వాటికంటే పెద్ద ప్రకటనదారు కూడా. దీంతో పోలిస్తే భారతీయ పత్రికలకు, టీవీ స్టేషన్లకు ప్రకటనలు ఇస్తే సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఒరిగే దేమీ ఉండదు. రిలయెన్స్ కంపెనీకి దాని ఉద్యోగు లకు సంబంధించిన విషయాలను కూడా మీడియా నివేదించాలని నేను ఇక్కడ చెప్పడం లేదు. కాని అదే సమయంలో సాఫ్ట్‌వేర్ సంస్థల పట్ల మీడియా తప్పు చేస్తున్నదని మాత్రమే చెబుతున్నాను. ప్రాధా న్యతలను బట్టి వార్తలను నివేదించే సమస్యను మరో కవరేజ్‌లో కూడా మనం చూడవచ్చు. భార త్‌లో ఏటా 25 వేల అత్యాచారాలు జరుగుతున్నా యి. (వాస్తవానికి పశ్చిమ దేశాలతో సహా ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే), కానీ మీడి యా మాత్రం ఈ అత్యాచారాల్లో అత్యంత ప్రాధా న్యత కలిగి ఉన్నారని తను భావించే బాధితులనే వార్తల కోసం ఎంచుకుంటుంది. ఢిల్లీ నగరంలో ట్యాక్సీ సర్వీసులో అనేకమంది  అమ్మాయిలు అత్యా చారాలకు గురవుతున్న  వాస్తవం కట్టెదుట కనిపిస్తు న్నప్పటికీ ఉబెర్ క్యాబ్‌లో ఎగువ తరగతి మహిళ అత్యాచారానికి గురైన కథనం విపరీత ప్రాధాన్య తను పొందుతుంది.
 
 స్పష్టంగానే భారతీయ మీడియా మధ్యతరగతి భారతీయుల మనోభావాలకు నిత్యం విలువనిస్తోం ది. వీరి దృష్టిలో పేదలు అంతగా పట్టించుకోదగి నంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే పేదల జీవి తాలే అంత ప్రాధాన్యమైనట్టివి కాదు. (థామస్ హాబ్స్ మాటల్లో చెప్పాలంటే అవి ‘మురికి, పశు ప్రాయమైన, అల్ప’ జీవితాలు మరి).
 (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
- ఆకార్ పటేల్

 Aakar.patel@icloud.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement