లక్నో : దేశానికి కాబోయే ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ నుంచే అవుతారని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. కానీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ, మాయావతిలలో ఎవరికి మద్దతు ఇస్తారో అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని అన్నారు.
‘ దేశం కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ప్రజలు కొత్త ప్రధానిని కోరుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే దేశానికి కొత్త ప్రధానికి వస్తారు. అదీ కూడా యూపీ నుంచే అవుతారు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలోనే మీరు కొత్త సంకీర్ణం గురించి వింటారు అని సమాధానమిచ్చారు.
‘ గత ఎన్నికల్లో బీజేపీ 47 పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మేము కూడా( ప్రతిపక్షాలన్ని) ఏకతాటిపైకి వచ్చి బీజేపీని గద్దెదింపుతాం’ అని అన్నారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణాలు వివరిస్తూ... కుల, మతాల పేరుతో ప్రజలను విడగొట్టి బీజేపీ గెలిచిందన్నారు. ట్రిపుల్ తలాక్‌పై పార్టీ వైఖరి ఎంటని ప్రశ్నించగా పార్లమెంట్‌లో బిల్లు చర్చకు వచ్చినపుడు తమ వైఖరేంటో తెలియజేస్తామన్నారు. బీఎస్సీతో కలిసే ఉంటామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
యూపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ..ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన కేవలం రిబ్బన్ కటింగ్‌లు మాత్రమే చేస్తున్నారు కానీ.. ప్రాజెక్టులను ప్రారంభించడానికి మాత్రం ముందుకు రాలేదని విమర్శించారు. వ్యవసాయ రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి
‘ప్రధాని కావాలనే కోరిక లేదు’
Comments
Please login to add a commentAdd a comment