చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి | Ambati Rambabu Slams Chandrababu Over Capital Presents Video Of Insider Trading | Sakshi
Sakshi News home page

పది మీటర్ల దూరంలో సరిహద్దు రేఖ ఆగిపోయింది!

Published Thu, Jan 2 2020 6:22 PM | Last Updated on Thu, Jan 2 2020 7:01 PM

Ambati Rambabu Slams Chandrababu Over Capital Presents Video Of  Insider Trading - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తాము ప్రజలకు తెలియజేస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్‌ను వైఎస్సార్‌ సీపీ ప్రసారం చేసింది. ఇందులో భాగంగా రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వివరాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లు అంబటి రాంబాబు తెలిపారు. అమరావతిలో ఏం జరిగిందనే విషయంలో.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆధారాలతో సహా విజువల్‌ను ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. ‘రాజధాని ప్రాంతంలో అసైన్డు భూముల కొనుగోలు, క్విడ్‌ ప్రోకో ఒప్పందాలు, రాజధాని ప్రకటన విషయంలో గందరగోళం, ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో జరిగిన అన్యాయం, లింగమనేనికి సంబంధించిన భూములకు సరిగ్గా పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడం’ వంటి అంశాలను ఇందులో చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై భువనేశ్వరి ఎందుకంత జాలి చూపిస్తున్నారని ప్రశ్నించారు. ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో గిట్టుబాటు ధర లేక రైతులు చనిపోయారు. అప్పుడు ఎందుకు భువనేశ్వరికి రైతుల మీద ప్రేమ కలగలేదు. చంద్రబాబు ప్రచార పిచ్చి వలన పుష్కరాల షూటింగ్‌లో 30 మంది చనిపోయారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు... ఎన్టీఆర్ ఊరు ఊరు తిరుగుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ఎందుకు భువనేశ్వరికి  జాలి కలగలేదు. రైతుల ప్రేమా లేదంటే బినామీ భూములు మీద ప్రేమా. సమైక్యాంధ్ర కోసం ఎంతో మంది చనిపోయారు. అప్పుడు ప్రేమ ఎందుకు కలగలేదు. తన కుమారుడు బినామీల పేరుతో కొన్న భూముల కోసం విరాళం ఇచ్చారా..?’ అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు పట్ల రాజధాని రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన కారుణ్య మరణాలు అంటున్నారు. హత్యలు చేసి రాజధాని కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని నమ్మిస్తారు. చంద్రబాబు ఎంత నీచనికైనా తెగిస్తారు. జాగ్రత్త’ అని ప్రజలను అప్రమత్తం చేశారు.(బట్టబయలైన అమరావతి కుంభకోణం)

అందుకే ఏపీకి నష్టం...
‘జైలుకు వెళ్ళడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలి. రాజ్యాంగం మీద చంద్రబాబు ప్రమాణం చేసి చంద్రబాబు మాట తప్పారు. రాజధాని ఇక్కడ నుంచి తరలిపోలేదు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. బినామీ రైతులకు, బ్రోకర్స్‌కు ప్రభుత్వం న్యాయం చేయలేదు. నిజమైన రైతులకు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మూడు ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ది చేకూరుస్తారు. గతంలో హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసారు అని చంద్రబాబు తీరును అంబటి ఎండగట్టారు. ‘ఉల్లిపాయల ధరలు దేశ వ్యాప్తంగా పెరిగితే చంద్రబాబు ఒక కేజీ అయిన రైతులకు హెరిటేజ్ నుంచి ఇచ్చారా. చంద్రబాబు అంత తొందర పడితే ఎలా? తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఇంకా విచారణ జరుగుంది. ఎంతటి పెద్ద వారైనా శిక్ష తప్పదు. పవన్ కల్యాణ్ ఊరేగిoపుగా వెళ్తే ముళ్ల కంచె వేయరా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లింగమనేనికి ఎలాంటి సంబంధం ఉందో అందరికి తెలుసు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. పవన్ రోజుకొక మాట మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement