బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయలబ్ది కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్సాటు చేస్తున్నారని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపయోగం లేని ఈ సమావేశానికి తాము ఎందుకు హాజరు కావాలని ప్రశ్నించారు. సొంత లాభం కోసమే చంద్రబాబు అఖిలపక్ష భేటీ పెట్టారన్నారు. మొదట కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని ఒప్పుకున్న చంద్రబాబు, రాజకీయ ప్రయెజనాల కోసమే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్‌లో టీడీపీ చేస్తున్న పనులు సమర్దనీయం కాదని, అదే పనిని అసెంబ్లీలో ప్రతి పక్షాలు చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు సమయం కూడా ఇవ్వని చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి రండి అనడం సబబు కాదన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని బయటకు పంపి ప్రశ్నించకుండా గొంతు నొక్కారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేద్దామని చూస్తే, చంద్రబాబు సోనియా, రాహుల్‌తో కలిసి నిరసన చేపట్టడం ఉపయోగం లేని పని అని విష్ణుకుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment