
సాక్షి, విజయనగరం : భారీ వర్షం కారణంగా సోమవారం విజయనగరం జిల్లా ఎస్ కోటలో జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష బహిరంగ సభ అర్థాంతరంగా నిలిచిపోయింది. చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సభకు చేరకున్న వెంటనే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. దీంతో సభాప్రాంగణంలో ఉన్న ప్రజలు చెట్ల కిందకు పరుగులు తీశారు. ఉరుములు, మెరుపుల శబ్ధానికి భయపడ్డ జనం చెట్ల కింద నుంచి సమీపంలోని దుకాణాలు, షెడ్ల కిందకు వెళ్లి బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. ఉదయం భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆందోళనకు గురయ్యారు. భయంకరమైన ఈదురు గాలుల కారణంగా సమీపంలోని రేకులు ఎగిరి పడుతున్నాయి.