
సాక్షి, బళ్లారి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరుపై కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ఏదైతే చెప్తారో.. అది చేయనేచేయరని విమర్శించారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
‘అబద్ధపు హామీలు ఇచ్చి.. వాస్తవ దూరమైన కలలు చూపి మభ్యపెట్టేవారిని నమ్మడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి తీరుతుంది. కానీ నరేంద్రమోదీ మాత్రం ఏదైతే చెప్తారో.. అది చేయనేచేయరు’ అని రాహుల్ విమర్శించారు.
‘భవిష్యత్ కార్యాచరణ గురించి కానీ, యువతకు ఉద్యోగాల కల్పన గురించి కానీ, రైతులకు సాయం చేయడం గురించి కానీ పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడలేదు. గతం గురించి, కాంగ్రెస్ గురించి ఆయన గంటసేపు ప్రసంగించారు. ప్రధాని గారూ మీరు భవిష్యత్తు గురించి చెబితే.. దేశం వినాలనుకుంటోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment