
ముంబై : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ భేటీ అయ్యారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వం ఏమైనా కూలుతుందా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, తర్వాత అజిత్ ఇచ్చిన వివరణతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలు.. సోమవారం స్వతంత్ర ఎమ్మెల్యే సంజయ్ షిండే కుమార్తె వివాహ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం ఈ విషయంపై అజిత్ పవార్ వివరణనిస్తూ.. వాతావరణం, వర్షపాతం గురించే మేం మాట్లాడాం. ఎలాంటి రాజకీయ విషయాలు ప్రస్తావనకు రాలేదు. పెళ్లి నిర్వాహకులు చేసిన ఏర్పాట్ల వల్ల మేం పక్కపక్కనే కూర్చున్నాం తప్ప కావాలని కూర్చోలేదని మీడియాకు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment