
సాక్షి, హైదరాబాద్: బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అభ్యర్థుల తొలి జాబితాను 27 మందితో విడుద ల చేసింది. బీఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ఈ జాబితాను గురువారం విడుదల చేశారు. బీఎల్‌ఎఫ్ ప్రకటించిన 27 మంది లో ఎస్సీ స్థానాలు 7, ఎస్టీ స్థానాలు 3, జనరల్ స్థానా లు 17 ఉన్నాయి. ఇందులో 9 మంది సీపీఎం అభ్యర్థులు, 14 మంది బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండి యా (ఎంసీపీఐ) అభ్యర్థులు ముగ్గురు, తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి శ్రీనివాస్ బహద్దూర్‌ను నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా ప్రకటించారు.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు..
సీపీఎం అభ్యర్థులు..
తొడసం భీమ్‌రావు (ఖానాపూర్), మర్రి వెంకటస్వామి (మానకొండూరు), ఎ.మల్లేశ్ (నర్సాపూర్), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), శేఖర్‌రావు (హూజూర్‌నగర్), బుర్రి శ్రీరాములు (కోదాడ), డాక్టర్ మిడియం బాబూరావు (భద్రాచలం), భూక్యా వీరభద్రం (వైరా), మాచర్ల భారతి (సత్తుపల్లి)
బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు..
కోట వెంకన్న (సిర్పూరు), కనకం వంశీ (చొప్పదండి), ఫసీమొద్దీన్ (కరీంనగర్), పి.జయలక్ష్మి (ఆంధోల్), గుజ్జ రమేశ్ (మేడ్చల్), రాఘవేంద్రస్వామి గౌడ్ (రాజేంద్రనగర్), జయరాములు (దేవరకద్ర), వెంకటేశ్వర్లు (కొడంగల్), జింకల కృష్ణయ్య (వనపర్తి), రంజిత్‌కుమార్ (గద్వాల), రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ (సూర్యాపేట), సిద్దం రాము (వరంగల్ తూర్పు), వసపాక నర్సింహ (వర్ధన్నపేట), కోట రాంబాబు (మధిర)
ఎంసీపీఐ అభ్యర్థులు..
సబ్బని కృష్ణ (బెల్లంపల్లి), తాండ్ర కుమార్ (శేరిలింగంపల్లి), మద్దికాయల అశోక్ (నర్సంపేట)
Comments
Please login to add a commentAdd a comment