సాక్షి, కృష్ణా : పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగి రమేష్ వాలంటీర్లతో కలిసి శనివారం ఇంటింటికి వెళ్లి పేదలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీలోని పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడకూడదనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. కరోనా మహమ్మరి కట్టడికి సీఎం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. నిరుపేదలకు మూడు విడుతలుగా ఉచిత రేషన్, వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారన్నారు.
('ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించండి')
రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో పడుకొని రాష్ట్రంలో అది చేయండి.. ఇది చేయండి అంటూ బోడి సలహాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మా ప్రభుత్వానికి నీతులు చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయాల్లో బతికే ఉన్నానని ప్రజలకు గుర్తు చేసేలా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రోజుకో లెటర్ రాస్తున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చే బాధ్యత మా ప్రభుత్వానిదేనని జోగి రమేశ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment