
శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ కోరికలు నెరవేరాలి: వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం మీకు, మీ ఆత్మీయులకు సుఖసంతోషాలను, సమృద్ధిని అందించాలి’ అని వైఎస్ జగన్ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉట్టి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలోని చిన్నారులతో జననేత ఉట్టికొట్టించారు. బాలకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు.