సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో లంబాడీలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ శనివారం విమర్శించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజనులు, లంబాడీలు నివసించే తాండా లు, గూడేలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, అభివృద్ధి కోసం రూ.5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతంలో గిరిజనుల సంస్కృతికి ఎలాంటి హాని జరగకుండా అభివృద్ధి పనులు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment