సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పండి | ravindra naik on kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పండి

Published Tue, Feb 6 2018 2:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

ravindra naik on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టిన సీఎం కేసీఆర్‌కు గిరిజనులు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్‌ సోమవారం కోరారు. మోసపూరిత ప్రకటనలతో గిరిజనులను మభ్యపెడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని సూచించారు.

గిరిజనుల మధ్య మారణకాండకు కారణమైన టీఆర్‌ఎస్‌ను ఆ పార్టీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. తండాల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఒట్టి మాటలు చెబితే ప్రయోజనం ఉండదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement