న్యూఢిల్లీ: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలను సంధించింది. డోక్లాం సమస్యపై చైనాతో చర్చలు జరిపి ఆ దేశానికి బలమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్‌చార్జ్ రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జింపింగ్‌తో మోదీ సమావేశం కానున్నరు. ఈ సమావేశంలో మోదీ డోక్లాం సమస్య గురించి జింపింగ్‌తో చర్చలు జరపాలని ట్విటర్ వేదికగా కోరారు.
దక్షిణ డోక్లాం గుండా చైనా నిర్మిస్తున్న రోడ్‌పై మోదీ ఎందుకు మోనంగా ఉన్నారని రణ్‌దీప్ ప్రశ్నించారు. ఇటీవల ఇద్దరు కేంద్రమంత్రులు చైనా పర్యటనకు వెళ్లి డోక్లాం సమస్య గురించి ప్రస్తావించకపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుపట్టారు. మంత్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని, విధినిర్వహణలో మంత్రులు విఫలమయ్యారని మోదీ అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.
డోక్లాం సరిహదుల్లో భారత మిలటరీ క్యాంపుకు చైనా దళాలు 10 మీటర్లు ముందుకు దూసుకువచ్చాయని ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా చేరుకున్న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జింపింగ్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. చివరి రోజు సమావేశంలో రెండు దేశాల ప్రతినిధులతో మోదీ, జింపింగ్ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment