సాక్షి, హైదరాబాద్: కులాల మధ్య చిచ్చు పెట్టే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయా లని తెలంగాణ గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. గోండు, కోయ, లంబాడీల మధ్య ఘర్షణలను సృష్టిస్తూ వారిని అభద్రతాభావంలోకి నెట్టిందని గిరిజన జేఏసీ నేతలు రవీంద్రనాయక్, ఎం.సూర్యనాయక్, శంకర్‌నాయక్, అంగోతు గణేశ్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనుల్లో ప్రభుత్వం భయాం దోళనలను సృష్టిస్తోందని, ఇటువంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని తెలిపారు.
కన్నన్ వంటి ఐఏఎస్ అధికారులు, కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్రకు పాల్పడటం దారుణమన్నారు. లంబాడీలపై సాగుతున్న కుట్రలను అడ్డుకోవడంలో టీఆర్‌ఎస్‌కు చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి గోండు, కోయ కులాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అటవీ కార్పొరేషన్ పదవిని గోండు, కోయలకు ఇవ్వాలని కోరారు. గిరిజనుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటించి వారి మధ్య ఐక్యత కోసం కృషి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment