సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ద్రోహి అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతి నిధి వేణుగోపాల చారి తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే యావత్తు తెలంగాణ జాతి క్షమించదన్నారు. నాలుగేళ్లుగా ఎన్నికలకు పోదామంటూ సవాళ్లు విసిరిన కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీలు ఇప్పుడు ఓటర్ల జాబితా తప్పులతడక అంటూ ఎందుకు వెనకాడుతున్నాయని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, సీపీఎస్ రద్దు అంటూ హామీలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ముందు ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ హామీలను అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. అధికార దాహంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment