
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో చురకలంటించారు. చంద్రబాబు ఇంకా తాను ముఖ్యమంత్రినేనని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ రోజు ఆయనకు నాలుగు సార్లు ఫోన్‌చేసి సలహాలు తీసుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు భ్రమలో నుంచి బయటకు వస్తే బాగుటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
(‘మీరు నామినేట్ అయ్యారని మరిచిపోకండి’)
'తానింకా సీఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రమలో మునిగి తేలుతున్నాడట బాబు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహుకరించారని అంటున్నారు'. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా సంక్షోభ సమయంలో సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఆపదల నుంచి గట్టెక్కిస్తున్నారని పేర్కొన్నారు. ' రాష్ట్ర అధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. డబ్ల్యుహెచ్‌వో కూడా ఆరా తీస్తోంది' అంటూ ట్వీట్ చేశారు.
(లాక్‌డౌన్ : పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు)