లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ నిత్యం కాషాయ దుస్తులు ధరిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కార్యాలయ భవనానికీ కాషాయ హంగులు అద్దనున్నారు. సీఎం కార్యాలయమున్న లాల్‌బహదూర్ శాస్త్రి భవన్‌కు కాషాయం పెయింట్ వేయాలని నిర్ణయించారు. ఆదిత్యనాథ్ కార్యాలయంలోని టవళ్లు, టేబుల్ కవర్లు కూడా కాషాయ రంగులోనే ఉంటాయి. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల కోసం పలు రంగుల్ని పరిశీలించినప్పటికీ కాషాయమే అత్యుత్తమంగా తేలిందన్నారు.
ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమర్‌నాథ్ అగర్వాల్ స్పందిస్తూ..‘ ఏ రంగు కూడా చెడ్డది కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయాకు సైతం కాషాయం రంగు వేయడం మొత్తం పరిపాలనా వ్యవస్థను కాషాయీకరణం చేయడమే’ అని మండిపడ్డారు. ఇటీవల యోగి ఆవిష్కరించిన 50 బస్సులకు కూడా కాషాయం రంగు వేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ శిలాఫలకాలను కాషాయ వస్త్రాలతో అలంకరించడంతో పాటు బెలూన్లు కూడా కాషాయ రంగులోని వాటినే వాడారు. చివరికి రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు కాషాయ రంగులో ఉన్న బ్యాగులనే అందజేశారు. అంతేకాకుండా యోగి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా అందించిన బుక్‌లెట్లను, ప్రభుత్వం అందించిన సమాచార డైరీలను కూడా ఈ రంగుతోనే ముద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment