
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. తొలిరోజు ప్రచారంలో ఆయన ఆదివారం విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రచారం చేస్తారు.
సోమవారం ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో, 12 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం, మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.