
‘ఎవరిదైనా భారీ మొత్తంలో (590 కేజీల) గంజాయి పోయిందా? అయితే బాధపడకండి.. అది గత రాత్రి ట్రక్కుతో సహా మాకే దొరికింది. మీదైతే మాత్రం ధుబ్రి పోలీసులకు టచ్‌లో ఉండండి. వారు పక్కా మీకు సహాయం చేస్తారు.’ అని అస్సాం పోలీసులు చేసిన ఓ ఫన్నీ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పోలీసుల చెక్‌పాయింట్ చూసి ట్రక్కుతో సహా వదిలి జారుకున్న గంజాయి స్మగ్లర్లు పట్ల అస్సాం పోలీసులు చేసిన ఈ వ్యంగ్యం నవ్వులు పూయిస్తోంది. పోలీసులు ట్వీట్ చేసిన ఫొటోలో గంజాయి ప్యాక్ చేసిన 50 కాటన్లున్నాయి. దుండగులు చగోలియా చెక్‌పాయింట్‌లో ఈ బాక్సులను ట్రక్కుతో వదిలివెళ్లారు. గత కొంతకాలంగా ఆయా రాష్ట్రాల పోలీసులు ప్రజలకు వారి సేవలను మరింత చేరువయ్యేందకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. కిడ్నాప్ కేసులను చేధించడంలో.. ట్రాఫికి నిబంధనలు తెలపడం కోసం వినూత్న ట్వీట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
Anyone lost a huge (590 kgs) amount of Cannabis/Ganja and a truck in and around Chagolia Checkpoint last night?
— Assam Police (@assampolice) June 4, 2019
Don't panic, we found it.
Please get in touch with @Dhubri_Police. They will help you out, for sure ;)
Great job Team Dhubri. pic.twitter.com/fNoMjbGSKX
Comments
Please login to add a commentAdd a comment