
న్యూఢిల్లీ:ఓ మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి మధుకర్ బాబూరావు రహానేను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం తన కారులో వెళుతున్న సమయంలో మధుకర్ రహానే మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. దీనికి సంబంధించి మధుకర్‌ను కొల్హాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
జాతీయ రహదారి నంబర్ 4పై కుటుంబంతో కలిసి హ్యూండయ్ కారులో వెళుతుండగా కంగల్ ఏరియా పరిధిలో ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పడంతో అస్తాయ్ కాంబ్లే అనే మహిళను ఢీకొట్టాడు. దాంతో స్థానికులు సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఆస్పత్రిలో మృతిచెందడంతో రహానే తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు రహానే తండ్రి మధుకర్ రహానేపై 304 ఎ, 337, 338, 184 ఐపీసీ సెక్షన్ క్రింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment