ముర్రే X రోనిచ్
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
80 ఏళ్ల తర్వాత రెండోసారి వింబుల్డన్ టైటిల్ సాధించిన రెండో బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందడానికి ఆండీ ముర్రే... కెనడా తరఫున తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించేందుకు మిలోస్ రోనిచ్... ఆదివారం జరిగే వింబుల్డన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. 2013లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ముర్రే తన స్థాయికి తగ్గట్టు ఆడితే రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకోవడం కష్టమేమీకాదు. బ్రిటన్ తరఫున ఫ్రెడ్ పెర్రీ (1934, 1935, 1936లలో) మాత్రమే మూడుసార్లు వింబుల్డన్ టైటిల్ సాధించాడు.
మరోవైపు 2002 తర్వాత ఫెడరర్, జొకోవిచ్, రాఫెల్ నాదల్ లేకుండా తొలిసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ముఖాముఖి రికార్డులో ముర్రే 6-3తో రోనిచ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఈ ఇద్దరూ రెండుసార్లు (2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 యూఎస్ ఓపెన్) తలపడగా... రెండుసార్లూ విజయం ముర్రేనే వరించింది.
సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం