
దీటుగా బదులిస్తున్న ఆసీస్
: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం టీమిండియా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది.
బ్రిస్బేన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం టీమిండియా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. టీమిండియా విసిరిన 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. దీంతో 20.0 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు షాన్ మార్ష్(46 బ్యాటింగ్), అరోన్ ఫించ్( 38బ్యాటింగ్) లు జట్టు స్కోరును ముందుకు తీసుకువెళుతున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవడంతో టీమిండియా మూడొందల పైచిలుకు పరుగులు సాధించింది. విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణిస్తే, రోహిత్(124; 127 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ తో శతకం నమోదు చేశాడు. ఈ జోడీ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాది వేయగా, ఆపై రోహిత్-అజింకా రహానే ల జోడి మూడో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రహానే(89) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.