పెర్త్: సొంతగడ్డపై ఈ సీజన్‌లో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా మరోసారి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని చూపించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి టి20లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేయగలిగింది. ఇఫ్తిఖార్ అహ్మద్ (37 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఒక్కడే కాస్త ఆదుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టు తరఫున ఆడిన ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ సీన్ అబాట్ (2/14), కేన్ రిచర్డ్సన్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం ఆసీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్ నష్టపోకుండా 11.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వార్నర్ (35 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి 49 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. మూడు మ్యాచ్‌ల పోరులో తొలి టి20 వర్షంతో రద్దు కాగా... ఆసీస్ 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment