దిల్బాగ్ ఆరోపణలపై న్యాయస్థానానికి అఖిల్
న్యూఢిల్లీ: భారత బాక్సర్ దిల్బాగ్‌సింగ్‌పై మరో బాక్సర్, కామన్వెల్త్ క్రీడల మాజీ విజేత అఖిల్‌కుమార్ పరువునష్టం దావా వేశాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ విషయంలో దిల్బాగ్ తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను అఖిల్ ఈ చర్యకు దిగాడు. గత ఆగస్టులో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో... అఖిల్ శిష్యుడైన మన్‌దీప్ జాంగ్రా చేతిలో దిల్బాగ్ ఓడిపోయాడు.
అయితే అఖిల్ తన శిష్యుడిని గెలిపించేందుకు అక్రమాలకు పాల్పడ్డాడని, సెలక్షన్ కమిటీని ప్రభావితం చేశాడని మాజీ జాతీయ చాంపియన్ అయిన దిల్బాగ్ ఆరోపించాడు. జాతీయ కోచ్ జి.ఎస్.సంధూ పైనా ఆరోపణలు చేశాడు. దీంతో దిల్బాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిల్.. అందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాడు. జాతీయ బాక్సింగ్ సమాఖ్య కూడా షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినా దిల్బాగ్ వెనక్కి తగ్గకపోవడంతో చండీగఢ్‌లోని జిల్లా కోర్టులో అఖిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
కోర్టులో ‘బాక్సింగ్’
Published Thu, May 1 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement
Advertisement