
సోమర్‌సెట్ : ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం తన గర్ల్‌ఫ్రెండ్ క్లేర్ రాట్‌క్లిఫ్‌ను క్రిస్టియన్ సంప్రదాయం పద్దతిలో వివాహమాడాడు స్టోక్స్. స్టోక్స్-రాట్‌క్లిఫ్‌ల జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వివాహానికి ఇంగ్లండ్ క్రికెటర్లు రూట్, మోర్గాన్, బ్రాడ్, గ్రాహం ఆనియన్స్, జోస్ బట్లర్, అలిస్టర్ కుక్‌లు హాజరయ్యారు.
దీంతో వివాహం జరుగుతున్న గ్రామంలోని చర్చి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివెళ్లారు. కాగా, సరిగ్గా నెల రోజుల క్రితం ఓ బార్ వద్ద జరిగిన గొడవలో స్టోక్స్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment