
గగన్ నారంగ్‌కు నిరాశ
10 మీ. ఎయిర్ రైఫిల్‌లో దక్కని చోటు
కామన్వెల్త్ క్రీడలకు షూటర్ల ఎంపిక
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ పతకం సాధించిన ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్. తన కెరీర్‌లో సాధించిన ఘనతలు ఇందులోనే ఎక్కువ. నారంగ్ ప్రధాన ఈవెంట్ ఇదే. కానీ జులై, ఆగస్టుల్లో స్కాట్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో గగన్‌కు 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చోటు దక్కలేదు.
కామన్వెల్త్ క్రీడల కోసం జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ)ప్రకటించిన జాబితాలో నారంగ్‌కు... 50 మీ. త్రీ పొజిషన్ రైఫిల్, 50 మీ. ప్రోన్ విభాగాల్లో మాత్రమే చోటు దక్కింది. ఇటీవల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్‌లో అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉందంటూ ఎన్‌ఆర్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా తనకిష్టమైన 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో చోటు దక్కించుకున్నాడు.