టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగేది అనుమానంగా మారింది.
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగేది అనుమానంగా మారింది. స్టేడియంలో 1800 సీట్ల సామర్థ్యం ఉన్న ఆర్‌పీ మెహ్రా బ్లాక్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా అమ్మలేదు. దీనికోసం ఐసీసీ ఆదివారం వరకే గడువునిచ్చింది. ఆ బ్లాక్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ బెంగళూరుకు తరలితే డీడీసీఏ రూ.4 కోట్లు నష్టపోతుంది. ‘ఇప్పటిదాకా అయితే వేదిక మార్పు గురించి ఐసీసీ, బీసీసీఐ నుంచి మాకు సమాచారం లేదు’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారి అన్నారు.