సెమీస్‌లో జోష్న, మహేశ్ | In Mix Josna, Mahesh | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జోష్న, మహేశ్

Published Sat, Aug 1 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చినప్ప విక్టోరియా ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది...

- విక్టోరియా ఓపెన్ స్క్వాష్
మెల్‌బోర్న్:
భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చినప్ప విక్టోరియా ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో మూడో సీడ్ జోష్న 11-6, 11-4, 8-11, 11-9తో మేగన్ క్రెయిగ్ (న్యూజిలాండ్)పై గెలిచింది. ఇదే టోర్నీ పురుషుల విభాగం క్వార్టర్స్‌లో మహేశ్ మంగావ్‌కర్ 13-15, 12-10, 11-8, 11-7తో హేకాక్స్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. మరో క్వార్టర్స్‌లో భారత క్రీడాకారుడు కుశ్ కుమార్ 5-11, 7-11, 9-11తో ఫింటిసిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement