భారత్‌కు మరో పరీక్ష
- నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్
- చాంపియన్స్ ట్రోఫీ
భువనేశ్వర్: వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం మరో పోరుకు సిద్ధమైంది. పటిష్టమైన నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గాలంటే అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో; రెండో మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్‌నైనా ‘డ్రా’ చేసుకుంటే పరువు దక్కించుకుంటుంది. అయితే లీగ్ మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ఈ టోర్నీ బరిలో ఉన్న ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఒకవేళ మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే గ్రూప్ ‘బి’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలుస్తుంది. క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘ఎ’లో టాప్‌గా నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్‌తో సర్దార్ సింగ్ బృందం ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తామాడిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై, రెండో మ్యాచ్‌లో 4-1తో జర్మనీపై విజయం సాధించింది.