క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్ | Indian team of Deepika Kumari, Bombayla Devi and Laxmirani Majhi beat Colombia | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్

Published Sun, Aug 7 2016 7:41 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్

క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్

భారత మహిళల ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో భారత మహిళల టీమ్ విజయం సాధించింది. కొలంబియాపై 5-3 తేడాతో గెలుపొంది భారత మహిళల జట్టు క్వార్టర్ పైనల్లోకి ప్రవేశించింది. తొలి సెట్ 52-51తో గెలిచిన దీపికా కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి బృందం రెండో సెట్ లో 49-50 తో వెనుకంజ వేసింది.

మూడో సెట్లో 52-52 తో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో నిర్ణయాత్మక సెట్ నిర్వహించారు. ఈ సెట్ లో భారత్ 52 పాయింట్లు కొల్లగొట్టగా, కొలంబియా మహిళల జట్టు కేవలం 44 పాయింట్లు స్కోరు చేయడంతో ఓటమి పాలైంది. భారత మహిళల ఆర్చరీ బృందం క్వార్టర్స్ లో రష్యాతో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement