రంజీ ట్రోఫీ రౌండప్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ నిరాశజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌తో ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ను కష్టపడి ‘డ్రా’గా ముగించింది. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌కు కనీసం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రాకపోవడం గమనార్హం. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో (ఫాలోఆన్) 113.1 ఓవర్లకు 329 పరుగులు చేసింది.
దీంతో కశ్మీర్‌కు 150 పరుగుల లక్ష్యం ఎదురైంది. కశ్మీర్ జట్టు 17 ఓవర్లలో 2 వికెట్లకు 56 పరుగులు చేసింది. సమయం సరిపోకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. కశ్మీర్‌కు 3, హైదరాబాద్‌కు 1 పాయింట్ లభించాయి. ఇతర మ్యాచ్‌లలో మధ్యప్రదేశ్ 87 పరుగులతో బరోడాపై, హిమాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్ 6 పరుగులతో త్రిపురపై, తమిళనాడు 8 వికెట్లతో రైల్వేస్‌పై, కర్ణాటక 92 పరుగులతో రాజస్తాన్‌పై, సౌరాష్ట్ర 4 వికెట్లతో సర్వీసెస్‌పై, విదర్భ 82 పరుగులతో మహారాష్ట్రపై విజయం సాధించాయి. బెంగాల్-హర్యానా, ఢిల్లీ-ఒడిషా, గోవా-జార్ఖండ్‌ల మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
‘డ్రా’తో గట్టెక్కిన హైదరాబాద్
Published Tue, Nov 3 2015 2:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement