పేస్ వర్సెస్ బోపన్న! | Leander Paes And Bopanna Drawn For Clash in Wimbledon Pre-Quarters | Sakshi
Sakshi News home page

పేస్ వర్సెస్ బోపన్న!

Published Sun, Jun 26 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

పేస్ వర్సెస్ బోపన్న!

పేస్ వర్సెస్ బోపన్న!

త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్లో డబుల్స్ విభాగంలో భారత నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న టెన్నిస్ జోడి రోహన్ బోపన్న-లియాండర్ల పేస్లు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో ఒకరికొకరు ప్రి-క్వార్టర్స్ లోఎదురుపడే అవకాశాలు కనబడుతున్నాయి.

లండన్: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్లో భారత నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న పురుషుల టెన్నిస్ డబుల్స్ జోడి రోహన్ బోపన్న-లియాండర్ పేస్లు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో ఒకరికొకరు ప్రి-క్వార్టర్స్ లోఎదురుపడే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వింబుల్డన్ డ్రా ప్రకారం ఇరు జోడీలు ఆదిలోనే అమీతుమీ తేల్చుకోనే అవకాశం ఉంది.  ఈ టోర్నీలో బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా(రోమేనియా)తో జత కడుతుండగా, పేస్-మార్కిన్ మాత్కోస్కి(పోలెండ్)తో జోడి కడుతున్నాడు.

 

అయితే  పేస్-మార్కిన్ మాత్కోస్కి ద్వయం తొలి పోరులో యెన్ సున్ లూ(తైపీ)-తిప్సిర్వెక్(సెర్బియా) తలపడుతుండగా, బోపన్న-ఫ్లోరియన్ మెర్జియా జంట మారిన్ డ్రాగాంజా-నికోలా మెక్టిక్(క్రొయేషియా)తో ఆడనునన్నారు.  ఈ రౌండ్ను అధిగమిస్తే తదుపరి పోరులో ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు ముఖాముఖి పోరులో తలపడనున్నారు. భారత నుంచి పురుషుల విభాగంలో రోహన్- పేస్ లు మాత్రమే వింబుల్డన్ కు అర్హత సాధించగా, మహిళ విభాగంలో సానియా మీర్జా పాల్గొంటుంది.  మహిళల డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల జోడి తొలి పోరులో అన్నా లీనా-లౌరా సిగ్మండ్ (జర్మనీ) జంటతో తలపడనుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement